Raayan OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. రాయన్ స్ట్రీమింగ్ ఎందులోనంటే?

అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇక తెలుగులోనూ ఈ సినిమా సుమారు 550 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా ధనుష్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ

Raayan OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. రాయన్ స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Raayan Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2024 | 12:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం రాయన్. ఇది అతని కెరీర్ లో 50 వ సినిమా కావడం విశేషం. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన రాయన్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇక తెలుగులోనూ ఈ సినిమా సుమారు 550 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా ధనుష్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 23 నుంచే రాయన్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ధనుష్ సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ,తమిళ్, మలయాళ భాషల్లో ధనుష్ రాయన్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. ఇందులో ధనుష్ సోదరి దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. అలాగే కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు.. వివిధ పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ రాయన్ సినిమాకు స్వరాలందించడం విశేషం. ఇందులోని ఉసురు నీతానే సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. మరి థియేటర్లలో రాయన్ సినిమాను మిస్ అయ్యారా? అయితే కొన్ని గంటలు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!