Viraaji OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సస్సెన్స్ థ్రిల్లర్ .. ఊహకు అందని ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు శుక్రవారం (ఆగస్టు23) అందుబాటులోకి రానున్నాయి. అయితే గురువారం (ఆగస్టు 22)అర్ధరాత్రి నుంచే కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. దీంతో పాటు మరో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Viraaji OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సస్సెన్స్ థ్రిల్లర్ .. ఊహకు అందని ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Viraaji Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2024 | 11:10 AM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు శుక్రవారం (ఆగస్టు23) అందుబాటులోకి రానున్నాయి. అయితే గురువారం (ఆగస్టు 22)అర్ధరాత్రి నుంచే కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. దీంతో పాటు మరో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన విరాజి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. నింద అంటూ ఓ డిఫరెంట్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆ వెంటనే విరాజీ అంటూ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకొచ్చాడు. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఈ సినిమాలో కనిపించాడు వరుణ్. రెండు డిఫరెంట్ కలర్స్‌లో వెరైటీ హెయిర్ స్టైల్, ముక్కు పుడక, ఒళ్లంతా టాటూస్‌తో కొత్త మేకోవర్‌లో కనిపించి సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 02న థియేటర్లలో విడుదలైన విరాజి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అయితే ప్రమోషన్లు పెద్గగా చేయకపోవడంతో విరాజీ లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విరాజి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 22 నుంచి విరాజి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే గురువారం అర్ధరాత్రి నుంచి వరున్ సందేశ్ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

విరాజీ సినిమాకు ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాలో ప్రమోదిని, రఘు కారు మంచి ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలినీ పులపా,ప్రసాద్ బెహరా తదితరులు వివిధ పాత్రల్లో మెప్పించారు. ఇక విరాజి సినిమా కథ విషయానికి వస్తే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోని రీతిలో కొందరు యువకులు ఆ ఆస్పత్రికి వెళ్తారు. అదే సమయంలో ఆండీ (వరుణ్ సందేశ్) రాకతో వాళ్ల జీవితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే విరాజి సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి విరాజీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.