Tollywood: పెళ్లి కూతురిలా ముస్తాబైన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్
పై ఫొటోలో తెల్లటి చీర కట్టుకుని ముఖం కనపడకుండా పెళ్లి కూతురిలా ఫొటోస్‌కు పోజులిస్తున్న దెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్. కేవలం ఒకే ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది.
Updated on: Aug 23, 2024 | 1:53 PM

పై ఫొటోలో తెల్లటి చీర కట్టుకుని ముఖం కనపడకుండా పెళ్లి కూతురిలా ఫొటోస్‌కు పోజులిస్తున్న దెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్. కేవలం ఒకే ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది.

సోషల్ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ అందాల తార తాజాగా కొన్ని అందమైన ఫొటోలను అందులో షేర్ చేసుకుంది. ఇందులో పెళ్లి కూతురిలా ముస్తాబై ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది.

మరి ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ప్రేమలు హీరోయిన్ మమితా బైజు. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ రానీ క్రేజ్ ప్రేమలు సినిమాతో తెచ్చుకుందీ అందాల తార.

ప్రేమలు సినిమా తర్వాత మమితా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెరిగింది.

మమితాకు తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్. విజయ్ దళపతి నటిస్తోన్న ఓ చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ వచ్చిందని టాక్.