AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiccha Sudeep: స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు ఇంతపెద్ద కూతురుందా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదుగా..

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్‌ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి ఈగలో విలన్ గా చేశాడు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడీ స్టార్ హీరో. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ప్రభాస్ బాహుబలి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరిశాడు

Kiccha Sudeep: స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు ఇంతపెద్ద కూతురుందా?   హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదుగా..
Kiccha Sudeep
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 9:35 PM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. శాండల్‌ వుడ్‌లో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్‌ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి ఈగలో విలన్ గా చేశాడు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడీ స్టార్ హీరో. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ప్రభాస్ బాహుబలి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరిశాడు. కాగ 1997 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు సుదీప్. ఇప్పటికీ అదే యంగ్ అంగ్ ఎనర్జిటివక్ ఫెర్మామెన్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు. సుదీప్ ప్రియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. సాధారణంగా సుదీప్ కూతురంటే ఓ 10-15 ఏళ్ల అమ్మాయి అయి ఉంటుందిలే అనుకుంటారు చాలా మంది. అయితే ఆయన కూతురు వయసు సుమారు 20 ఏళ్లు. అవును. తన పేరు శాన్వి సుదీప్. మరి 20 ఏళ్ల కూతురు ఉందంటే సుదీప్ వయసు ఎంతు ఉంటుందో గెస్ చేయగలరా? యంగ్ హీరోలా స్మార్ట్‌ గా, స్టైలిష్ గా కనిపించే అతని వయసు 52 ఏళ్లు.

ఇవి కూడా చదవండి

శాన్వి సుదీప్ విషయానికివస్తే.. ప్రస్తుతం ఈ అమ్మాయి చదువుకుంటోంది. అదే సమయంలో సింగర్ గానూ తన సత్తా చాటుతోంది. కిచ్చా సుదీప్ తన మేనల్లుడు సంచిత్ సంజీవ్‌ను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి అతనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తన గొంతును వినిపించింది శాన్వి. వీటన్నటినీ పక్కన పెడితే శాన్వీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడూ అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన తల్లిదండ్రుల ఫొటోలను కూడా అందులో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి. శాన్వీ ఫొటోలు చూసిన వారందరూ హీరోయిన్ లా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

తండ్రి సుదీప్ తో శాన్వి సుదీప్..

శాన్వీ సుదీప్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్