AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Movie: మంచు విష్ణు మొదటి మూవీ హీరోయిన్.. ఆ స్టార్ నటికి స్వయానా చెల్లెలా? ఇప్పుడెంటిలా మారిపోయింది

మొదటి సినిమానే అయినా విష్ణు ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. శిల్పా శివానంద్, నీతూ చంద్ర. మెయిన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర హీరో స్నేహితురాలి పాత్రలో కనిపించింది. అన్నట్లు ఈ శిల్పా మరెవ్వరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Vishnu Movie: మంచు విష్ణు మొదటి మూవీ హీరోయిన్.. ఆ స్టార్ నటికి స్వయానా చెల్లెలా? ఇప్పుడెంటిలా మారిపోయింది
Manchu Vishnu
Basha Shek
|

Updated on: Aug 23, 2024 | 12:08 PM

Share

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మంచు విష్ణు. తన పేరునే తన మొదటి సినిమా టైటిల్‌గా పెట్టుకుని తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణు. 2003లో రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మొదటి సినిమానే అయినా విష్ణు ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. శిల్పా శివానంద్, నీతూ చంద్ర. మెయిన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర హీరో స్నేహితురాలి పాత్రలో కనిపించింది. అన్నట్లు ఈ శిల్పా మరెవ్వరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్‌కు స్వయానా చెల్లెలు. సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అమితాబ్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితర స్టార్ నటీనటులతో యాడ్స్ చేసింది. ఆ తర్వాత అక్క బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బెజవాడ పోలీస్ స్టేషన్ తో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శివానంద్ ఆ తర్వాత వెంటనే మంచు విష్ణు మొదటి సినిమాలో కథానాయికగా ఎంపికైంది. అయితే తెలుగులో ఆమెకు ఇదే చివరి సినిమా. దీని తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

సాక్షి శివానంద్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా క్లిక్ కాలేదు శిల్పా శివానంద్. దీంతో బుల్లితెరపై దృష్టి మరల్చింది. లక్ కలిసి వస్తుందేమోనని తన పేరను ఓహన్నా శివానంద్‌గా మార్చుకుంది. అయితే పేరు మార్చుకున్నా ఆమె ఫేట్ మాత్రం మారలేదు. అడపా దడపా సీరియల్స్, సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ నుండి శాశ్వతంగా తప్పుకుంది. అయితే ఈ అందాల తార ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తన ఫొటోలతో పాటు అక్క సాక్షి శివానంద్ ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటుది. అయితే విష్ణు సినిమా శిల్పా శివానంద్‌కు ఇప్పటి ఓహన్నాకు అసలు పోలికలే ఉండవు. ఇప్పుడు చాలా మారిపోయిందీ అందాల తార. చాలా మంది ఆమెను చూసి అసలు గుర్తు పట్టలేకున్నారు.

సోదరి సాక్షి శివానంద్ తో శిల్పా శివానంద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..