AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ హౌస్‌లోకి బర్రెలక్క వచ్చేనా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా.. వీడియో రిలీజ్

బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటటికే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా వివిధ విషయాలతో బాగా వార్తల్లో నిలుస్తుందామె. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బర్రెలక్క పేరు మార్మోగిపోయింది

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ హౌస్‌లోకి బర్రెలక్క వచ్చేనా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా.. వీడియో రిలీజ్
Nagarjuna,barrelakka
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 8:22 PM

Share

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి కావొచ్చాయట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటటికే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా వివిధ విషయాలతో బాగా వార్తల్లో నిలుస్తుందామె. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బర్రెలక్క పేరు మార్మోగిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు జేడీ లక్ష్మీ నారాయణ, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బర్రెలక్క బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఇలా చెప్పుకొచ్చింది.

నా ఫేమ్ తగ్గిపోయిందట.. అందుకే..

. ‘ ఈ మధ్యన చాలా మంది నన్ను అక్కా… మీరు బిగ్ బాస్ షోకి వెళుతున్నారా? అని అడుగుతున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా నాకు హౌస్‌లోకి వచ్చే ఛాన్స్ వచ్చిందంటూ వీడియోలు చేస్తున్నారు. వీటిని నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో నా పేరు ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయిందట. ఇప్పుడు నన్ను తీసుకోవడం అవసరమా? అని ఆలోచిస్తున్నారట. మనిషికి ప్రాణమే శాశ్వతం కాదు. అలాంటిది ఫేమ్ శాశ్వతమా? హిట్ సినిా కూడా థియేటర్లలో నెల రోజులు మాత్రమే ఆడుతుంది. సూపర్ హిట్ మూవీ బహుశా రెండు నెలలు ఆడుతుంది. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, రాకున్నా ఇబ్బంది ఏం లేదు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నన్ను ఇష్టపడే అభిమానులకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఈ వీడియో చేశాను’ అని చెప్పుకొచ్చింది బర్రెలక్క.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఈ మాటలను చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 8లో బర్రెలక్క పాల్గొనడం లేదని తెలుస్తోంది. అలాగే ఆమెను ఎవరూ సంప్రదించలేదని అర్థముతోంది. మరి బిగ్ బాస్‌ షో లాంచింగ్ కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపు ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..