- Telugu News Photo Gallery Cricket photos Indian cricketer Washington Sundar sister Shailaja Sundar latest photos goes viral
Team Inda: స్టైలిష్‌గా మెరిసిపోతోన్న ఈ అమ్మాయి టీమిండియా స్టార్ ప్లేయర్ అక్క.. ఈమె కూడా క్రికెటరే
పై ఫొటోలో స్టైలిష్ దుస్తుల్లో ధగ ధగా మెరిసిపోతోన్న ఈ అమ్మాయి ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ సోదరి. ఈమె కూడా క్రికెటరే. అక్కాతమ్ముళ్లిద్దరూ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు. తమ ప్రతిభ నిరూపించుకున్నారు. అంతకు ముందు వీరి తండ్రి కూడా రంజీల్లో ఆడారు
Updated on: Aug 25, 2024 | 10:02 PM

పై ఫొటోలో స్టైలిష్ దుస్తుల్లో ధగ ధగా మెరిసిపోతోన్న ఈ అమ్మాయి ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ సోదరి. ఈమె కూడా క్రికెటరే. అక్కాతమ్ముళ్లిద్దరూ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు. తమ ప్రతిభ నిరూపించుకున్నారు. అంతకు ముందు వీరి తండ్రి కూడా రంజీల్లో ఆడారు.

ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సోదరి శైలజా సుందర్. ఈమె తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ లో ఆడింది.

అండర్-19 సౌత్‌జోన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది శైలజా సుందర్. అదే సమయంలో తమ్ముడు వాషింగ్టన్ క్రికెటర్‌గా ఎదగడంలో తన వంతు సహాయం, ప్రోత్సాహం అందించింది.

మైదానంలోనే కాదు క్రికెట్ కామెంటేటర్‌గానూ రాణిస్తోంది శైలజా సుందర్. పలు ప్రముఖ ఛానెళ్లకు స్పోర్ట్స్ యాంకర్‌గానూ పని చేసిందామె.

శైలజా, వాషింగ్టన్ ల తండ్రి ఎం. సుందర్ కూడా క్రికెటర్ కావడం విశేషం. ఆయన రంజీల్లో ఆడారు. ఇప్పుడు తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు అక్కా తమ్ముడు.

కాగా శైలజా సుందర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గ ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి.




