AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: భారత జట్టులో నో ఛాన్స్.. కట్‌చేస్తే.. దేశం వీడిన ఐదుగురు ఆటగాళ్లు..

Indian-Origin Players: టీం ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. కానీ, అధిక పోటీ కారణంగా లేదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చాలా మంది క్రికెటర్లు దేశం విడిచి విదేశీ జట్ల కోసం ఆడుతున్నారు.

Venkata Chari
|

Updated on: Aug 25, 2024 | 8:56 PM

Share
Indian-Origin Players: టీం ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. కానీ, అధిక పోటీ కారణంగా లేదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చాలా మంది క్రికెటర్లు దేశం విడిచి విదేశీ జట్ల కోసం ఆడుతున్నారు.

Indian-Origin Players: టీం ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. కానీ, అధిక పోటీ కారణంగా లేదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చాలా మంది క్రికెటర్లు దేశం విడిచి విదేశీ జట్ల కోసం ఆడుతున్నారు.

1 / 7
ఇలా అవకాశం లేక ఇతరత్రా కారణాలతో భారత్‌ను వదిలి విదేశీ జట్లలో చేరిన కొందరు ఆటగాళ్లు ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా మారారు. ఇందులో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, కెనడా జట్లలో భారత సంతతి ఆటగాళ్ల భాగస్వామ్యం పెరిగింది. అలాంటి ఐదుగురు ఆటగాళ్ల గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

2 / 7
మోనాంక్ పటేల్: 1993లో గుజరాత్‌లో జన్మించిన మోనాంక్ పటేల్ గుజరాత్ తరపున అండర్-16, అండర్-18 క్రికెట్ ఆడాడు. కానీ, అతను 2010లో USAకి మారాడు. ఇప్పుడు అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు USA జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మోనాక్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్‌లో అమెరికా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

3 / 7
హర్మీత్ సింగ్: ముంబైలో జన్మించిన హర్మీత్ సింగ్ 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. స్కూల్‌లో రోహిత్ శర్మ జూనియర్‌గా ఉన్న హర్మీత్ సింగ్, తనకు అవకాశం రాకపోవడంతో భారత్‌ను విడిచిపెట్టి USA జట్టులో చేరాడు. ప్రస్తుతం అమెరికా జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న హర్మీత్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్‌లో ఆడుతున్నాడు.

4 / 7
అభిషేక్ పరాడ్కర్: హైదరాబాద్ తరపున క్రికెట్ కెరీర్ ప్రారంభించిన అభిషేక్ ఇప్పుడు అమెరికా జట్టుకు ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు.

5 / 7
ఉత్కర్ష్ శ్రీవాస్తవ: లక్నోలో జన్మించిన ఉత్కర్ష్ శ్రీవాస్తవ తన కుటుంబం USAలో ఉన్నందున USA తరపున క్రికెట్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఉత్కర్ష్ తండ్రి భావుక్ శ్రీవాస్తవ USAలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, 2016లో దేశం విడిచి అమెరికాలో నివసిస్తున్నారు. ఆ విధంగా, ఉత్కర్ష్ కూడా అమెరికాలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. USA తరపున అండర్-19 క్రికెట్ కూడా ఆడాడు.

6 / 7
జస్దీప్ సింగ్: ఫాస్ట్ బౌలర్ జస్దీప్ సింగ్ USAలోని న్యూయార్క్‌లో జన్మించాడు. కానీ, అతని 3 సంవత్సరాల వయస్సులో కుటుంబం పంజాబ్‌కు మారింది. కానీ, 10 సంవత్సరాల తర్వాత, జస్దీప్ 13 సంవత్సరాల వయస్సులో USA కి తిరిగి వెళ్లి అక్కడ తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్‌లో అమెరికా తరపున ఆడుతున్నాడు.

7 / 7
Follow Us