Prabhutva Juniour Kalasala OTT: ఓటీటీలోకి వచ్చేసిన విలేజ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు అంటే జూన్ 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టింది. అయితే చిన్న సినిమా కావడం, ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా సందడి చేయని ఈ విలేజ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రస్తుతం ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. గత వారం రిలీజైన ప్రభాస్ కల్కి, ధనుష్ రాయన్ పైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ హారర్ ఫిల్మ్ ముంజ్యా కూడా ఓటీటీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే వీటన్నింటి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాల. శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ డ్రామాలో అందరూ కొత్త వాళ్లే నటించడం విశేషం. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రభాస్ ‘కల్కి’ థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు అంటే జూన్ 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టింది. అయితే చిన్న సినిమా కావడం, ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా సందడి చేయని ఈ విలేజ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది.
సినిమా కథేంటంటే..
తాజాగా ఈ సినిమాను తమ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ‘ ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ప్రేమకథ? అసలేం జరిగిందో తెలియాలంటే? ఆహాలో ఈ సినిమాను చూసేయండి’ అని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. రాయలసీమలోని పుంగనూరు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.. అది 204. వాసు (ప్రణవ్ ప్రీతమ్) ఇంటర్ ఫస్టియర్ చదువుతుంటాడు . అదే కాలేజీలో కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి సీఈసీ చదువుతుంటుంది. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో మంచి స్నేహితులుగా మారుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు వాసు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. మరి వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూడాల్సిందే.
ఆహాలో స్ట్రీమింగ్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.