Raj Tarun: ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

చాలాకాలం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించినంతగా మెప్పించలేకపోయింది. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో అంతగా ఆకట్టులేకపోయిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

Raj Tarun: ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Purushothamudu Movie
Follow us

|

Updated on: Aug 27, 2024 | 7:08 AM

ఇటీవల కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పేరు వార్తలలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో నిత్యం నెట్టింట ట్రెండ్ అయిన ఈ హీరో.. అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు. చాలాకాలం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించినంతగా మెప్పించలేకపోయింది. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో అంతగా ఆకట్టులేకపోయిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆహా.

“ధైర్యానికి ఉన్న శక్తిని చూసేందుకు రెడీగా ఉండండి. ఆగస్ట్ 29న పురుషోత్తముడు ఆహాలో ప్రీమియర్ కానుంది” అంటూ ట్వీట్ చేసింది ఆహా ఓటీటీ. ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన హాసినీ సుధీర్ కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించగా రామ్ భీమన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీఈవో కావాలనుకునే యువకుడు 100 రోజుల్లో సామాన్యుడిలా జీవితం గడపడం అనే అంశం చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. శ్రీశ్రీదేవి ప్రొడక్షన్ బ్యానర్ పై రమేశ్ తేజవత్, ప్రకాష్ తేజవత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాతోపాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన మరో సినిమా తిరగబడరా సామి. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. అటు రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ రైల్వేకు పదేళ్లలో రూ. 300 కోట్ల నష్టం..!
భారతీయ రైల్వేకు పదేళ్లలో రూ. 300 కోట్ల నష్టం..!
చిరు లీక్స్.. ‘విశ్వంభ‌ర’ పై అదిరిపోయే హింట్ ఇచ్చిన మెగాస్టార్..
చిరు లీక్స్.. ‘విశ్వంభ‌ర’ పై అదిరిపోయే హింట్ ఇచ్చిన మెగాస్టార్..
మరో 2, 3 వారాల్లో TGSRTCలో 3,035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌!
మరో 2, 3 వారాల్లో TGSRTCలో 3,035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌!
టాలీవుడ్‌కు కొత్త గ్లామర్.. వారసుల టైమ్ షురూ..!
టాలీవుడ్‌కు కొత్త గ్లామర్.. వారసుల టైమ్ షురూ..!
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై నిబంధనల బంధం.. కీలక రూల్స్ మార్పు
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై నిబంధనల బంధం.. కీలక రూల్స్ మార్పు
ఈ 5 యోగాసనాలు మహిళలకు అత్యంత ప్రయోజనకరం.. ట్రై చేసి చూడండి
ఈ 5 యోగాసనాలు మహిళలకు అత్యంత ప్రయోజనకరం.. ట్రై చేసి చూడండి
ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు.. రాజ్ తరుణ్..
ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు.. రాజ్ తరుణ్..
తన సొగసుతో ఆ మాధనుడిని కూడా మైమరపిస్తుంది ప్రగ్య జైస్వాల్..
తన సొగసుతో ఆ మాధనుడిని కూడా మైమరపిస్తుంది ప్రగ్య జైస్వాల్..
ఏపీ విద్యార్ధిని సత్తా.. భారీ ప్యాకేజీతో ఒకేసారి 5 కొలువులు కైవసం
ఏపీ విద్యార్ధిని సత్తా.. భారీ ప్యాకేజీతో ఒకేసారి 5 కొలువులు కైవసం
విమాన ప్రయాణంలో ఎంత నగదు తీసుకెళ్లవచ్చు? ఎంత లగేజీ ? నిబంధనలేంటి?
విమాన ప్రయాణంలో ఎంత నగదు తీసుకెళ్లవచ్చు? ఎంత లగేజీ ? నిబంధనలేంటి?