AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ రొమాంటిక్‌ మూవీ.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లోకి.. ఎక్కడ చూడొచ్చంటే?

30 వెడ్స్ 20 ఫేమ్ చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా హనీమూన్ ఎక్స్ ప్రెస్. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుడు ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ రొమాంటిక్‌ మూవీ.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లోకి.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 27, 2024 | 6:25 PM

Share

30 వెడ్స్ 20 ఫేమ్ చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా హనీమూన్ ఎక్స్ ప్రెస్. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుడు ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. జూన్ 21న థియేటర్లలో రిలీజైన హనీమూన్ ఎక్స్ ప్రెస్ పెద్దగా సందడి చేయలేదు. చిన్న సినిమా కావడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. అయితే అయితే ఐఎండీబీలో మాత్రం ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కు ఏకంగా 8.7 రేటింగ్ ఉండడం విశేషం. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది .అది కూడా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) అర్ధ రాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రేమ వివాహం, విడాకుల నేపథ్యంలో సాగే..

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రెండింగ్‌లో రావడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య మన స్పర్థలు వస్తాయి. శృంగార జీవితాన్నీ ఆస్వాదించలేక పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లకు సుహాసిని, తనికెళ్ల భరణి జంట కలుస్తుంది. కొత్త జంటను హనీమూన్ ఎక్స్‌ప్రెస్ రిసార్టుకు వెళ్లాల్సిందిగా సూచిస్తారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ చూడాల్సిందే. రొమాంటిక్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఒక్క రోజులోనే ట్రెండింగ్ లిస్టులోకి హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!