AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr. Bachchan OTT : ఓటీటీలోకి రవితేజ మిస్టర్ బచ్చన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా.?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయారు. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ రాజా రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

Mr. Bachchan OTT : ఓటీటీలోకి రవితేజ మిస్టర్ బచ్చన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా.?
Mr. Bachchan
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2024 | 3:10 PM

Share

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలన్నీ ఈ మద్యకాలంలో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయారు. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ రాజా రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. మొదటి షో నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మిస్టర్ బచ్చన్ సినిమాలో ఎప్పటిలానే రవితేజ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ కథలో అంతగా బలం లేకపోవడంతో సినిమా నిరాశపరిచింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ మూవీకి రీమేక్. హిందీలో వచ్చిన  ‘రైడ్’ సినిమాకు ఇది రీమేక్. అక్కడ అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

కానీ ఇక్కడ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాను ఎలా ఉందో అలా రీమేక్ చేసి ఉంటే కాస్త పర్లేదు అనిపించుకునేది. కానీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో సినిమా బెడిసికొట్టిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 12నుంచి మిస్టర్ బచ్చన్ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ లో కొన్ని సీన్స్ కూడా కట్ చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..