AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: జైలులో హీరో దర్శన్‌కు రాచ మర్యాదలు.. సీఎం సిద్ధరామయ్య సీరియస్.. కీలక ఆదేశాలు

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు కన్నడ స్టార్ హీరో. పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఈ హీరోను చూసి చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బయట లగ్జరీ లైఫ్ గడిపిన తమ హీరో జైలులో మగ్గిపోతున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు

Darshan: జైలులో హీరో దర్శన్‌కు రాచ మర్యాదలు.. సీఎం సిద్ధరామయ్య సీరియస్.. కీలక ఆదేశాలు
Actor Darshan, CM Siddaramaiah
Basha Shek
|

Updated on: Aug 26, 2024 | 2:27 PM

Share

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు కన్నడ స్టార్ హీరో. పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఈ హీరోను చూసి చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బయట లగ్జరీ లైఫ్ గడిపిన తమ హీరో జైలులో మగ్గిపోతున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా అబద్ధమని అర్థమై పోయింద. జైలులో హీరో దర్శన్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ అందుతుందని తెలుస్తోంది. సెంట్రల్ జైలులో అతను రాజ భోగాలు అందుకున్నట్లు స్పష్టమవుతోంది. జైలు ఆవరణలో దర్శన్ ఇతర రౌడీ షీటర్లతో కూర్చుని కులాసాగా కాఫీ తాగుతూ, సిగరెట్ ఊదుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. దీంతో పాటు వీడియో కాల్‌లో కూడా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో జైలు అధికారులు, ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య సదరు జైలు సిబ్బంది, ఉన్నతాధికారులప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబధించి డీజీ అండ్ ఐజీపీ అలోక్ మోహన్ నుంచి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. అలాగే దర్శన్ తదితరులను వెంటనే వేరే జైళ్లకు తరలించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు.

దీనిపై సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ, ‘నటుడు దర్శన్‌తో పాటు మరికొందరికి పరప్పన అగ్రహార జైలులో రాచ మర్యాదలు కల్పించిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించాను. దర్శన్‌తోపాటు మరికొందరిని తక్షణమే వివిధ జైళ్లకు తరలించాలని, జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించాను’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా దర్శన్ ను సోమవారం (ఆగస్టు 26) సాయంత్రం మరో జైలుకు తరలించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇదే విషయంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి పరమేశ్వర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి విచారణకు కూడా ఆదేశించారు. ఇందులో ఉన్నత అధికారుల ప్రమేయం తేలితే వారిని కూడా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

జైలులో హీరో దర్శన్ విలాసాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.