AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitara Ghattamaneni: ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే మహేష్ కూతురికి చాలా ఇష్టమట.. సితార ఫేవరేట్ స్టార్స్ వాళ్లే..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహేష్ తనయ సితార పేరు నెట్టింట తెగ మారుమోగుతుంది. ఇప్పటికే ఓ జ్యువెల్లరీ యాడ్ చేసిన సితార.. త్వరలోనే సినిమాల్లోకి అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని గతంలోనే బయటపెట్టిన సితార తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, స్టడీ, ఫ్యామిలీ విషయాలను పంచుకుంది. తాను చేసిన జ్యువెల్లరీ యాడ్ చూసి తన తండ్రి దాదాపుగా ఏడ్చినంత పనిచేశారని చెప్పుకొచ్చింది.

Sitara Ghattamaneni: ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే మహేష్ కూతురికి చాలా ఇష్టమట.. సితార ఫేవరేట్ స్టార్స్ వాళ్లే..
Sitara
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2024 | 2:02 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా ? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహేష్ తనయ సితార పేరు నెట్టింట తెగ మారుమోగుతుంది. ఇప్పటికే ఓ జ్యువెల్లరీ యాడ్ చేసిన సితార.. త్వరలోనే సినిమాల్లోకి అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని గతంలోనే బయటపెట్టిన సితార తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, స్టడీ, ఫ్యామిలీ విషయాలను పంచుకుంది. తాను చేసిన జ్యువెల్లరీ యాడ్ చూసి తన తండ్రి దాదాపుగా ఏడ్చినంత పనిచేశారని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే సితారకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో సితార తనకు ఇష్టమైన నటీనటుల గురించి చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సితారను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు యాంకర్స్. అందులో తన ఫేవరేట్ స్టార్ ఎవరని అడగ్గా.. తనకు రష్మిక మందన్నా, శ్రీలీల ఇద్దరు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఫేవరేట్ హీరో ఎవరని అడగ్గా.. తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలిపింది. ప్రస్తుతం సితారకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సితార రష్మికను కలిసిందని అంటున్నారు. అంతే కాదు సితార తన యూట్యూబ్ ఛానెల్‌లో రష్మికను కూడా ఇంటర్వ్యూ చేసింది. అలాగే ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషనల్ సాంగ్‌లో సితార కనిపించింది. అలాగే మహేష్, శ్రీలీల కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో తరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం తాను యాక్టింగ్ క్లాసెస్ కు వెళ్తున్నాని.. లండన్ లో యాక్టింగ్ ఎగ్జామ్స్ కు కూడా అటెండ్ అయ్యానని తెలిపింది. యాక్టింగ్ అంటే తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్. పలు సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?