- Telugu News Photo Gallery Cinema photos Mahesh babu next film SSMB29 Gaurda coming after a long gap in his career in film industry Telugu Heroes Photos
Mahesh Babu: మహేష్ బాబు కేరియర్ లో ఇదే ఫస్ట్ టైం.. ఎందుకిలా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్.?
సినిమా అప్‌డేట్ లేకపోయినా... మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ సారి సోషల్ మీడియా ట్రెండ్‌లో మహేష్‌ను గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు.? గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా, ఇంకా నెక్ట్స్ మూవీ పట్టాలెక్కించలేదు సూపర్ స్టార్ మహేష్.
Updated on: Aug 26, 2024 | 2:02 PM

సినిమా అప్‌డేట్ లేకపోయినా... మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ సారి సోషల్ మీడియా ట్రెండ్‌లో మహేష్‌ను గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు.

ఇంతకీ మహేష్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు.? గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా, ఇంకా నెక్ట్స్ మూవీ పట్టాలెక్కించలేదు సూపర్ స్టార్ మహేష్.

డ్రీమ్ కాంబో రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబీ 29 ఎనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.

సినిమా అప్‌డేట్ లేకపోయినా.. మహేష్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు సూపర్ స్టార్.

గతంతో పోలిస్తే మరింత లాంగ్ హెయిర్ థిక్ బియర్డ్‌తో కనిపించారు. దీంతో ఇంకెంత కాలం మేకోవర్ అవుతారు అన్న క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి. కృష్ణ జయంతి సందర్భంగా అప్‌డేట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ రాలేదు.

మహేష్ బర్త్ డేకి పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఆ డేట్ కూడా మిస్ అయ్యింది. ఈ టైమ్‌లో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లటంతో ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్ ఇప్పట్లో లేనట్టేనా అని టెన్షన్ పడుతున్నారు. మహేష్ ఇంకా వెకేషన్ మూడ్‌లోనే ఉండటంతో కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.? అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? అని ఫీల్ అవుతున్నారు అభిమానులు.

రాజమౌళి మేకింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మహేష్ రెండు మూడేళ్ల పాటు లాక్ అయినట్టే అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా మరింత ఆలస్యమవుతుండటంతో మహేష్ కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పదేమో అని ఫీల్ అవుతున్నారు.




