అందం, అభినయంతోపాటు వయ్యారాల ఫోజులతో ఇండస్ట్రీలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ ఆయేషా ఖాన్. బాలీవుడ్ లోకి మొదటగా తెరంగేట్రం చేసిన అయేషా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది. మొదట్లో చేసిన సినిమాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో రోజు రోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇన్ స్టాలో నిత్యం ఫోటోషూట్స్ షేర్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.