- Telugu News Photo Gallery Cinema photos Movie lover waiting for big movies in 2024 like Devara , game changer , Pushpa 2 Telugu Heroes Photos
2024 Big Movies: వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్న బిగ్ మూవీస్.! 2024 షేక్ అవ్వనుందా.?
ఈ ఏడాది ఫస్ట్ మూడు క్వార్టర్స్‌లో టాలీవుడ్ స్క్రీన్ మీద మిక్స్‌డ్ రిజల్ట్సే కనిపించాయి. అందుకే ఏడాది చివర్లో రాబోయే సినిమాల మీద ఫోకస్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్స్‌తో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది ముంగిపు భారీగానే ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు నెలాఖరున సరపోదా శనివారం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు నేచురల్ స్టార్ నాని.
Updated on: Aug 26, 2024 | 11:05 AM

ఈ ఏడాది ఫస్ట్ మూడు క్వార్టర్స్‌లో టాలీవుడ్ స్క్రీన్ మీద మిక్స్‌డ్ రిజల్ట్సే కనిపించాయి. అందుకే ఏడాది చివర్లో రాబోయే సినిమాల మీద ఫోకస్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్స్‌తో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది ముంగిపు భారీగానే ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఆగస్టు నెలాఖరున సరపోదా శనివారం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే రిలీజ్ అయిన అప్‌డేట్స్‌తో ఈ సినిమా మీద పాజిటివ్ బజే కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 27న మోస్ట్ అవెయిటెడ్ దేవర ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ స్టార్టింగ్‌లోనే విజయ్ ది గోట్ ఆడియన్స్ ముందుకు రానుంది. అక్టోబర్‌లోనూ క్రేజీ మూవీస్ రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేట్టయన్, సూర్య లీడ్ రోల్‌లో నటించిన కంగువ సినిమాలు అక్టోబర్ 10న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి దీంతో ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అంటున్నారు ఫ్యాన్స్. అదే నెలలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతానికి నవంబర్లో ఒక్క సిద్దూ జొన్నలగడ్డ మాత్రమే రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు. నవంబర్ 9న తెలుసు కదా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. మరికొన్ని సినిమాలు ఈ సీజన్‌లో డేట్స్ లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ 6న మోస్ట్ అవెయిటెడ్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్‌కు బేబీ జాన్‌తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి.

సంక్రాంతి రిలీజ్ అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత.. మెగా టీమ్ ఏమంటోంది.




