- Telugu News Photo Gallery Cinema photos Heroine Sai Pallavi wants different roles, her next movie updates Telugu Actress Photos
Sai Pallavi: డిఫరెంట్ రోల్స్ కావాలంటున్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.
మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి, ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోయిన్‌గా సౌత్, నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తనలోని మరో షేడ్ చూపించాలనుకుంటున్నారు. అందుకోసం ఆల్రెడీ మేకర్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మాలీవుడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. తరువాత తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
Updated on: Aug 26, 2024 | 11:46 AM

మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి, ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోయిన్‌గా సౌత్, నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తనలోని మరో షేడ్ చూపించాలనుకుంటున్నారు.

అందుకోసం ఆల్రెడీ మేకర్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మాలీవుడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. తరువాత తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

కమర్షియల్ సినిమాలు చేసినా.. నటిగా తనకు గుర్తింపు తీసుకువచ్చే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. నేచురల్ బ్యూటీ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఆ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన మలబార్ బ్యూటీ, మళ్లీ బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ తండేల్‌లో నాగచైతన్యకు జోడిగా నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు.

మోస్ట్ అవెయిటెడ్ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కమర్సియల్ సినిమాల్లోనూ పర్ఫెమెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటించారు సాయి పల్లవి.

అందుకే అప్ కమింగ్ సినిమాల విషయంలో కాస్త కొత్తగా ట్రై చేయాలనుందంటున్నారు. అవకాశం వస్తే ఫుల్‌లెంగ్త్ కామెడీ, యాక్షన్ రోల్స్ చేయాలన్నది సాయి పల్లవి కోరికట.

అంతేకాదు నటిగా ఇంత బిజీగా కొనసాగుతూనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ. తనకు డైరెక్షన్ చేయాలనుందన్న సాయి పల్లవి, అందుకు కథ కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు.




