AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr Bachchan OTT: ముందుగానే ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. ఆ స్పెషల్ డేనే స్ట్రీమింగ్.. ఎందులోనంటే?

షాక్, మిరపకాయ్ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్'ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో రిలీజైంది.

Mr Bachchan OTT: ముందుగానే ఓటీటీలోకి 'మిస్టర్ బచ్చన్'.. ఆ స్పెషల్ డేనే స్ట్రీమింగ్.. ఎందులోనంటే?
Mr Bachchan Movie
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 10:54 AM

Share

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ యాక్షన్ ఎంటర టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం.. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. షాక్, మిరపకాయ్ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ మూవీ తడబడింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. దీనికి తోడు బరిలో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, ఆయ్ సినిమాలు నిలవడంతో గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయడు మిస్టర్ బచ్చన్. అయితే ఎప్పటిలాగే రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అభిమానులను అలరించాడు. అలాగే కొత్త హీరోయిన్, భాగ్యశ్రీ భోర్సే అందాలు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాను కొంతలో కొంత నిలబెట్టాయి. థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి పండడ కానుకగా సెప్టెంబరు 6 లేదా 7వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని టాక్. పండగ పూట సెలవు కావడంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడున్నట్లు సమాచారం.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ..

రవితేజ క్రేజ్, హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని దాదాపు ఇర‌వై ఐదు కోట్ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ద‌క్షిణాది భాష‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే కమెడియన్ సత్య‌, ప్ర‌వీణ్, ఝూన్సీ, స‌చిన్ ఖేడ్క‌ర్, చమ్మక్ చంద్ర తదితరులు కీల‌క పాత్ర‌ల్లో మెరిశారు.

మిస్టర్ బచ్చన్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక