Urfi Javed: ‘సమంత నాకు ఫ్రెండ్.. మేం తరచూ మాట్లాడుకుంటాం’.. టాలీవుడ్ నటి గురించి ఉర్ఫీ ఆసక్తికర విషయాలు

ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఉర్ఫీ జావేద్ లైఫ్ స్టైల్ మిగతా నటీమణులందరి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత నేపథ్యంపై ఒక కొత్త వెబ్ షో రానుంది. దాని పేరు 'ఫాలో కర్ లో యార్'. ఆగస్టు 23 నుంచి 'ఫాలో కర్ లో యార్' షో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' OTTలో స్ట్రీమింగ్ అవుతోంది.

Urfi Javed: 'సమంత నాకు ఫ్రెండ్.. మేం తరచూ మాట్లాడుకుంటాం'.. టాలీవుడ్ నటి గురించి ఉర్ఫీ ఆసక్తికర విషయాలు
Urfi Javed, Samantha
Follow us
Basha Shek

|

Updated on: Aug 27, 2024 | 10:30 PM

ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఉర్ఫీ జావేద్ లైఫ్ స్టైల్ మిగతా నటీమణులందరి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత నేపథ్యంపై ఒక కొత్త వెబ్ షో రానుంది. దాని పేరు ‘ఫాలో కర్ లో యార్’. ఆగస్టు 23 నుంచి ‘ఫాలో కర్ లో యార్’ షో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఉర్ఫీ నిజ జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కోసం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత రూత్ ప్రభు గురించి ఉర్ఫీ మాట్లాడింది. ‘సమంత, నేను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులం’ అని ఉర్ఫీ జావేద్ చెప్పుకొచ్చింది. ‘సమంతకు నా వీడియో నచ్చితే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదు. నేను ఆమెతో ఇన్‌స్టాగ్రామ్‌లో పలు సార్లు ముచ్చటించాను’ అని ఉర్ఫీ తెలిపింది.

కాగా వెరైటీ డ్రస్సులతో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఆమె మరో విషయాన్ని ప్రస్తావించింది. ‘అర్జున్ కపూర్‌పై నాకు ప్రేమ ఉంది. ఆయనంటే నాకు ఇష్టం’ అని బాలీవుడ్ నటుడిపై ప్రేమను ఒలకబోసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

చాలా మంది ఉర్ఫీ కామెంట్స్ విని ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా సామ్ తన స్నేహితురాలంటూ చెప్పుకోవడం షాక్ కు గురి చేసింది. కాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఉంది. నెట్టింట ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది.

గ్లామరస్ దుస్తుల్లో ఉర్ఫీ జావేద్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Uorfi (@urf7i) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందా? వెంటనే చెక్ చేసుకోండి!
మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందా? వెంటనే చెక్ చేసుకోండి!
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..