OTT Movie : ఒంటరిగా చూస్తే ఇక అంతే..! ఓటీటీని షేక్ చేస్తున్న హారర్ మూవీ..

కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది ఆ సినిమా.

OTT Movie : ఒంటరిగా చూస్తే ఇక అంతే..! ఓటీటీని షేక్ చేస్తున్న హారర్ మూవీ..
Horror Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2024 | 7:08 PM

ఓటీటీలో హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఎన్నో సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది ఆ సినిమా. ఈ సినిమా ఒంటరిగా ఉన్నప్పుడు చూడకపోవడమే బెటర్. ఎందుకంటే సీన్ సీన్ కు సుస్సు పడిపోతుంది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇంతకు ఆ సినిమాలో అంతగా భయపెట్టే కథ ఏంటంటే..

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

దాదాపు 70 ఏళ్ల క్రితం ఓ అనే గ్రామంలో ఓ యువకుడు తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయిని పెళ్లాడాలనుకుంటాడు. కానీ తన ఇంట్లో వాళ్లు అది కుదరదు అని చెప్తారు. పెద్ద గొడవే జరుగుతుంది. దాంతో ఇంట్లో వాళ్లు అతనికి ఉపనయనం చేస్తారు. కానీ అతను మాత్రం ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే గ్రామంలో సముద్రం దగ్గర ఉన్న ఓ గ్రామంలోని శాపగ్రస్త చెట్టు దగ్గర తన సొంత చెల్లిని నర బలి ఇద్దామనుకుంటాడు. కానీ అది కుదరదు అక్కడే అతను చనిపోతాడు. అయితే ఉపనయనం చేసిన తర్వాత పది రోజులుకూడా కాకుండా చనిపోయిన అతను దెయ్యంగా మారతాడని ఆ గ్రామ జనాలు ఆ చెట్టుకు పూజలు చేస్తారు. ఆ కథ అక్కడికి అయిపోతుంది.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

కట్ చేస్తే మరో కథ ఓ యువకుడు తన తల్లితో కలిసి ఓ పార్లర్ రన్  చేస్తుంటాడు. అతను తనతో పాటే పెరిగిన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అది తెలియక మరోరిని లవ్ చేస్తుంది. ఇదిలా ఉంటే తన కజిన్ పెళ్లి కోసమని ఆ యువకుడు ఎక్కడైతే ఆ పైన కథలో ఓ వ్యక్తి చనిపోయాడో ఆ గ్రామానికి వెళ్తాడు. ఆతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఓ దెయ్యం వల్ల వెంటపడుతుంది. ఆతర్వాత ఏం జరిగింది.? ఆ దెయ్యం నుంచి వాళ్లు ఎలా బయట పడ్డారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆ సినిమా పేరు ముంజ్యా. ఇటీవలే హిందీలో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది.  కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ డిస్ని హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ ఇప్పుడు టాప్ 3లో ట్రెండ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.