Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగ నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్.

Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..
Simran
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 27, 2024 | 7:48 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగ నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్. మహేష్ హీరోగా నటించిన యువరాజు సినిమాలో నటించింది. అలాగే సిమ్రాన్ తమిళ్‌లోనూ దాదాపు అందరు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సిమ్రాన్.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సిమ్రాన్. సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఆతర్వాత ధ్రువనక్షతం అనే సినిమాలో నటించింది.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్. ఇదిలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు. సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.