ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా హాట్ గురూ..!

చిరంజీవి హీరోగా ఆయన చేసిన అంజి సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు.

ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా హాట్ గురూ..!
Chiranjeevi
Follow us

|

Updated on: Aug 27, 2024 | 8:12 PM

అప్పట్లో కోడి రామకృష్ణ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొనేది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడిరామకృష్ణ. అప్పట్లోనే ఆయన సోషియో ఫాంటసి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అప్పటికి ఉన్న గ్రాఫిక్స్‌తోనే అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు కోడిరామకృష్ణ. చిరంజీవి హీరోగా ఆయన చేసిన అంజి సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు. ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు. అందరు దేవుళ్లు ఆ పిల్లలకు ఎలా సాయం చేశారు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు కోడిరామకృష్ణ.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇక ఈ సినిమాలో నటించిన చిన్నారుల్లో బేబీ నిత్య.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గా తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. తన వయ్యారంతో కుర్రాళ్లను కవ్వించింది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

నువ్వు తోప్ రా.., పిట్టా కథ, వాంటెడ్ పండుగాడులాంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యా శెట్టి. సోషల్ మీడియాలో తన అందాలతో కవ్విస్తుంది నిత్యా శెట్టి. క్రేజీ ఫోటోలు, ఆకట్టుకునే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యా శెట్టి. సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతోంది. మంచి ఆఫర్స్ వస్తే హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.