రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. సాలిడ్ హిట్ కోసం రవితేజ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఆర్టీ 75 చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు రవితేజ.

రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 26, 2024 | 8:17 PM

మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను లైనప్ చేస్తున్నారు రవితేజ. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. సాలిడ్ హిట్ కోసం రవితేజ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఆర్టీ 75 చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు రవితేజ. ఇదిలా ఉంటే రవితేజతో హీరోయిన్ గా , వదినగా నటించింది ఓ ముద్దుగుమ్మ . ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఓల్డ్ హీరోయిన్ కూడా కాదు, లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీనే.. ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

అవును ఓ యంగ్ హీరోయిన్ రవితేజకు హీరోయిన్ గా వదినగా నటించింది. ఆమె ఎవరో కాదు అందాల భామ శ్రుతిహాసన్. రవితేజ శ్రుతిహాసన్ ది హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు సినిమాలో ఈ ఇద్దరూ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత క్రాక్ అనే సినిమాలో చేశారు. క్రాక్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. క్రాక్ సినిమాలో రవితేజ పోలీసు ఆఫీసర్ గా నటించి మెప్పించారు.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

ఇక పోతే రవితేజకు వదిన శ్రుతిహాసన్ నటించిన సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమానే వాల్తేరు వీరయ్య. ఈసినిమాలో చిరంజీవి హీరోగా నటించారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తమ్ముడిగా రవితేజ నటించారు. కాగా ఈసినిమాలో చిరుకి జోడీగా శ్రుతిహాసన్ నటించింది. దాంతో టెక్నీకల్ గా శ్రుతిహాసన్ రవితేజకు వదిన అయ్యింది. ఇలా రవితేజ పక్కన హీరోయిన్ గా అలాగే వదినగా నటించింది శ్రుతి. ఈ అమ్మడు ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా గడిపేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 సినిమాలో చేస్తోంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.