మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్ సునామీ … ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు
ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రముఖ నటి సోనియా మల్హర్ 2013లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా సెట్లో తనను లైంగికంగా వేధించారని సిట్‌కి ఫిర్యాదు చేశారు.

అంతులేని ఆ వినీలాకాశం నిండా మిల మిలా మెరిసే నక్షత్రాలు.. అందమైన చందమామ.. వెన్నెల రాత్రుల్లో కంటికి ఇంపుగా కనిపించే దృశ్యాలివి. కానీ అత్యంత మనోహరంగా కనిపించే ఆ ఆకాశం నిండా ఎన్నో అంతు చిక్కని రహస్యాలుంటాయి. అయితే నిజంగా ఆ నక్షత్రాలు మెరిసేవీ కావు.. చంద్రుడు భూమిపై నుంచి కనిపించే అంత అందగాడు కూడా కాదు.. ఇది సైన్స్ చెప్పే నిజం. కంటికి కనిపించేదంతా అన్ని సార్లు నిజం కాదు.. ఒక్కోసారి ఉప్పు కూడా పంచదారలానే కనిపిస్తుంది. ఇవన్నీ తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్ తన నివేదిక ప్రారంభంలో ప్రస్తావించిన వాక్యాలు. నిజానికి ఈ 2-3 వాక్యాలతోనే తన 295 పేజీల రిపోర్ట్‌లో ఏమందన్న విషయాన్ని స్పష్టంగా తేల్చేసింది. సరే అందులో 63 పేజీలు ఎందుకు తొలగించారన్నది వేరే విషయం. రిపోర్ట్ రిలీజైన మొదట్లో కేవలం మాలివుడ్‌కి మాత్రమే పరిమితం అనుకున్న ఈ దుమారం. రోజులు గడిచే కొద్దీ విస్తరించడం మొదలైంది. అసలు నివేదికలో ఏముంది..? నివేదిక విడుదలైన తర్వాత తలెత్తిన పరిణామాలపై గతంలోనే ఓ కథనాన్ని ప్రచురించాం కనుక.. ఇప్పుడు ఆ వివరాలను మళ్లీ ప్రస్తావించడం లేదు. (ఆ కథనం కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి. ) 2019లోనే నివేదిక నిజానికి ఈ నివేదికను 2019లోనే కమిటీ ప్రభుత్వానికి అందించింది. అయితే అనేక చట్టపరమైన కారణాలు, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు దాన్ని బయట...