Watch: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు.. ఇంటి పైకప్పు ఎక్కిన మొసలి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
ఈ క్రమంలోనే గుజరాత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని ఒక ఇంటి పైకప్పుపై మొసలిని చూపిస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంది. గుజరాత్‌లోని ఓ ఇంటి పైకప్పుపై మొసలి కనిపించింది.
Gujarat Rains: గుజరాత్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగాయి. ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 18 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఈ క్రమంలోనే గుజరాత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని ఒక ఇంటి పైకప్పుపై మొసలిని చూపిస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంది. గుజరాత్‌లోని ఓ ఇంటి పైకప్పుపై మొసలి కనిపించింది. గురువారం వడోదరలోని అకోటా స్టేడియం ప్రాంతాన్ని వర్షం ముంచెత్తడంతో వరదల్లో సరీసృపాలు కొట్టుకువచ్చాయి.
ఈ వీడియో చూడండి..
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK
— Press Trust of India (@PTI_News) August 29, 2024
మరోవైపు వరద పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎంని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.