AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Om Parvat: ఓం పర్వతంపై మంచు మాయం..! ఉత్తరాఖండ్‌ వెళ్తున్న భక్తులు, పర్యాటకుల్లో ఆందోళన.. కారణం ఇదేనట..!!

వ్యాస్‌ లోయలో 14 వేల అడుగుల ఎత్తులో ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ‘ఓం’ ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతానికి ఓం పర్వతం అనే పేరు వచ్చింది. ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా, ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలు ఇక్కడి ఓం పర్వతాన్ని

Om Parvat: ఓం పర్వతంపై మంచు మాయం..! ఉత్తరాఖండ్‌ వెళ్తున్న భక్తులు, పర్యాటకుల్లో ఆందోళన.. కారణం ఇదేనట..!!
Om Parvat Without Snow
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2024 | 11:45 AM

Share

Om Parvat: మంచుతో కప్పబడి ఉన్న ఓం పర్వతం ఒక్కసారిగా కనుమరుగైపోయింది. కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఓం అనే ఆకారకం కూడా కనిపించకుండా పోయింది. అప్పుడు అక్కడ చూడటానికి నల్లటి ఎత్తైన బండరాళ్లతో కూడి కొండ మాత్రమే మిగిలి ఉంది. ఓం పర్వతం పరిస్థితి చూసి స్థానికులతో పాటు పర్యాటకులు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్‌ మంచుకొండలు ఆ మహాశివుడి నిలయంగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా ఓం పర్వతం భోలేనాథ్ నివాసంగా నమ్ముతారు. అలాంటి ఓం పర్వతం కొన్ని అవాంఛనీయ సంఘటనలను సూచిస్తోంది. ఓం ఆకారంలో భక్తులకు కనువిందు చేసే పర్వతం ఇప్పుడు ఎలా మాయమైందో తెలిస్తే షాక్‌ అవుతారు.

వ్యాస్‌ లోయలో 14 వేల అడుగుల ఎత్తులో ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ‘ఓం’ ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతానికి ఓం పర్వతం అనే పేరు వచ్చింది. ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా, ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలు ఇక్కడి ఓం పర్వతాన్ని చూడటానికి వచ్చినప్పుడు వారికి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ ఒక పర్వతం ఉంది.. కానీ అందులో ఓం ఆకారం లేదు. అటువంటి పరిస్థితిలో, పర్వతం నుండి ఓం ఆకారాన్ని ఎవరు తొలగిస్తారనేది అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తున్న సందేహం.

కానీ, గత వారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు.ఓం పర్వతం నుండి మంచు కరగడానికి కారణం హిమాలయాల్లో నిరంతరం పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత అంటున్నారు పరిశోధకులు. గత ఐదేళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరుగుదల, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, హిమాలయాల్లోని జోలింగ్‌కాంగ్‌ను ప్రధాని గతేడాది అక్టోబర్‌లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి పది రెట్లు పెరగడం కూడా తాజా పరిస్థితికి కారణమని నిపుణులు వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..