Tuition Teacher: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్.. తల్లిదండ్రులు వేసిన శిక్షేంటో తెలుసా..?
చదువు చెప్పాల్సిన గురువే, చిన్నారుల పట్ల దారుణానికి ఒడిగట్టాడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కానీ, ఆ దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్పాలని గ్రామంలోనే అతనికి దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో తరగతి గదిలోకి వెళ్లిన బాలికల తల్లిదండ్రులు అతన్ని నిలదీశారు. అతనిపై మాటలతో దాడి చేశారు. అతని బట్టలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలికలు, మహిళలపై నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయి. కోల్‌కతా, బద్లాపూర్‌లో చెలరేగిన ఆందోళన మంటలు ఇంకా చల్లారలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు కీచక ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులే శిక్షించారు. మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిన సంఘటన ఇది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు గురువు గురు-శిష్యుల పట్ల హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తిస్తే.., మరోవైపు ప్రజలు ఆ దుర్మార్గుడి పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శించారు. ట్యూషన్ టీచర్ తన తరగతి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడని మనస్తాపానికి గురయ్యారు. అవమానంగా భావించిన బాలికలు తమ తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశారు. అమ్మాయిలు ఆరోపించిన మేరకు సదరు టీచర్ ప్రవర్తన పట్ల ఆరా తీశారు తల్లిదండ్రులు. పిల్లల ఫిర్యాదుతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని సంప్రదించగా, అతని వైఖరి వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దాంతో ఆ తల్లిదండ్రులే నిందితుడైన టీచర్‌కు గుణపాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
చదువు చెప్పాల్సిన గురువే, చిన్నారుల పట్ల దారుణానికి ఒడిగట్టాడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కానీ, ఆ దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్పాలని గ్రామంలోనే అతనికి దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో తరగతి గదిలోకి వెళ్లిన బాలికల తల్లిదండ్రులు అతన్ని నిలదీశారు. అతనిపై మాటలతో దాడి చేశారు. అతని బట్టలు చించి, బెల్టుతో కొట్టి, వీధిలో అర్ధనగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగలేదు బాధిత తల్లిదండ్రులు.. పోలీసులకు ఫోన్ చేసి టీచర్ పై ఫిర్యాదు చేసి వారికి అప్పగించారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాధిత బాలికల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల మేరకు ..ట్యూషన్‌కు వెళ్లేందుకు ఆడపిల్లలు నిరాకరించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని, 13 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్యూషన్‌కు వెళ్లకపోవడానికి కారణం ఏంటని అడగడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిదండ్రులను ఒప్పించి, కారణం తెలుసుకున్నారు. తరగతిలో ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించాడని చెప్పింది.అందుకే ఆమెకు ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టం లేదని చెప్పింది. బాలిక నుంచి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..అదే ట్యూషన్‌కు వెళ్తున్న ఇతర అమ్మాయిలతో మాట్లాడి విషయం కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో బాలికల తల్లిదండ్రులంతా గుమిగూడి ట్యూషన్ టీచర్ వద్దకు వెళ్లగా అతడి తీరు చూసి ఆగ్రహించి టీచర్‌ను కొట్టారు. ఇంతలో బట్టలు చింపేసి ఇంటి నుంచి బయటకు నెట్టి బెల్టుతో కొట్టి పోలీసులకు అప్పగించినట్టుగా చెప్పారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన బోధకుడిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.