ఉదయాన్నే వేడి నీళ్లలో చిటికెడు దీన్ని కలుపుకుని తాగండి.. నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్..!

ఇది కాలేయానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది. దీంతో జీర్ణాశయం శుభ్రమవుతుంది. ఫైల్స్ ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. బ్లాక్ సాల్ట్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.. తక్కువ సోడియం స్థాయిలుంటాయి.

ఉదయాన్నే వేడి నీళ్లలో చిటికెడు దీన్ని కలుపుకుని తాగండి.. నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్..!
Black Salt
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2024 | 7:06 AM

ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. సైలెంట్‌ కిల్లర్‌లా ఎటాక్‌ చేస్తున్న షుగర్‌ వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించలేకపోతున్నారు ప్రజలు. కానీ అది శరీరాన్ని లోపల నుండి పనికి రాకుండా మార్చేస్తూ వస్తుంది. అప్పుడు గానీ, ఈ వ్యాధి బయటకు అర్థమవుతుంది. మధుమేహంతో శరీరం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే, తాగే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అందువల్ల నల్ల ఉప్పు డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నల్ల ఉప్పుతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా చెబుతున్నారు. దీని వినియోగం వల్ల గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు రావు. ఐరన్, సోడియం, కాల్షియం వంటి మూలకాలు నల్ల ఉప్పులో ఉంటాయి. తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు తీసుకోవడం మధుమేహంతో బాధపడేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. బ్లాక్ సాల్ట్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా. సాధారణ ఉప్పు కంటే బ్లాక్ సాల్ట్ సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెరకు ఉపయోగపడుతుంది. నల్ల ఉప్పును నీటిలో కలిపి తీసు కుంటే మధుమేహం సమస్య నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వేడి నీటిలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ బ్లాక్‌ సాల్ట్‌తో ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అపానవాయువు తగ్గుతాయి. ఇది కాలేయానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ సాల్ట్ ఎసిడిటీ రోగులకు కూడా మేలు చేస్తుంది. బ్లాక్ సాల్ట్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. నల్ల ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది. దీంతో జీర్ణాశయం శుభ్రమవుతుంది. ఫైల్స్ ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. బ్లాక్ సాల్ట్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.. తక్కువ సోడియం స్థాయిలుంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..