AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి కర్మ రా సామీ.. హెల్మెట్‌ లేకుండా కారు నడిపిన డ్రైవర్‌ కు జరిమానా..! ఎంతో తెలుసా..?

టూవీలర్‌ నడిపించే వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే కచ్చితంగా ఫైన్ వేస్తారు. అయితే ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన జరిగింది, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని ఒక కారు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు. ఈ వింత సంఘటన

ఇదెక్కడి కర్మ రా సామీ.. హెల్మెట్‌ లేకుండా కారు నడిపిన డ్రైవర్‌ కు జరిమానా..! ఎంతో తెలుసా..?
UP-Man fined
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2024 | 1:32 PM

Share

గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఆటో డ్రైవర్‌కి 500 రూపాయలు జరిమానా విధించిన వింత ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. తాజాగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు ఓ కారు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 జరిమానా విధించిన ఘటన సంచలనంగా మారింది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా తీవ్ర దుమారం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టూవీలర్‌ నడిపించే వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే కచ్చితంగా ఫైన్ వేస్తారు. అయితే ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన జరిగింది, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని ఒక కారు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో జరిగింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించని జర్నలిస్టుకు రూ.1000 జరిమానా విధించారు ట్రాఫిక్‌ పోలీసులు. తొమ్మిది నెలల క్రితం నవంబర్ 9, 2023, రాంపూర్‌కు 188 కి.మీ దూరంలో ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో జర్నలిస్ట్ తుషార్ సక్సేనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని ఆరోపిస్తూ పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు. పెనాల్టీ చలాన్ విధించారు. మొదట్లో, తుషార్ తప్పు జరిగిందంటూ కంగారుపడినట్టుగా చెప్పాడు. అయితే అంతలోనే మెయిల్ కూడా వచ్చింది. పెనాల్టీ మొత్తాన్ని చెల్లించకపోతే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది.

దీంతో షాక్ తిన్న తుషార్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. కానీ నాకు ఎందుకు జరిమానా విధించారు. నేను ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఎప్పుడూ బైక్‌ నడపలేదు. కారు లోపల హెల్మెట్ ధరించాలని చెప్పే ఏదైనా నియమం ఉంటే, అది అమలులోకి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి. అంటూ విన్నవించుకున్నాడు. దీనిపై విచారణ జరిపి జరిమానాను ఉపసంహరించుకోవాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులను అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..