AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా.. సైకిల్‌తో బట్టలు ఉతకటం చూస్తే షాక్ అవుతారు..!

దీంతో నీళ్లలో ముంచి ఉంచిన బట్టలు సర్ఫ్‌కు వాషింగ్‌ మెషిన్‌లో ఉతికినట్టుగానే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట దూసుకుపోతోంది. విపరీతమైన వ్యూస్, లైకులతో హోరెత్తిస్తోంది. 

Viral Video: వారెవ్వా.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా.. సైకిల్‌తో బట్టలు ఉతకటం చూస్తే షాక్ అవుతారు..!
Desi Cycle Washing Machine
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2024 | 12:44 PM

Share

ఓ మహిళ సైకిల్‌తో బట్టలు ఉతుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లాడి సైకిల్‌ను టబ్‌లో ఉంచి పెడల్ తిప్పుతూ బట్టలు ఉతుకుతూ తీరుకు నెటిజన్లు ఆశ్చర్యంతో మూర్చపోయేలా ఉన్నారు. ఇలాంటి వీడియో తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇవి చూడటానికి చాలా సరదాగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ మహిళ బట్టలు ఉతికేందుకు ప్రయత్నించి నయా ట్రిక్‌ చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టి చూస్తు్న్నారు. ఈమె బుర్రె బుర్ర అంటూ యువతి చర్యలకు నవ్వుకుంటూ ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు.

కేవలం 12-సెకన్ల క్లిప్‌తో కూడిన ఈ వీడియోలో టబ్‌లో నీళ్లు పోసి కొన్ని బట్టలు వేసి ఉతికేందుకు సిద్ధపడింది ఓ మహిళ. అందులో బట్టలు వాష్‌ చేసేందుకు కావాల్సిన సర్ఫ్‌ కూడా ఇక చిన్నపిల్లలు తొక్కుకునే సైకిల్‌ తీసుకుని ఆ టబ్‌పై వేసింది. సైకిల్‌ పెడల్‌ టబ్‌లో ఉండేలా పెట్టింది. ఇక అంతే.. ఈజీగా సైకిల్ పెడల్‌ తిప్పుతూ బట్టల్ని వాష్‌ చేస్తోంది. దీంతో నీళ్లలో ముంచి ఉంచిన బట్టలు సర్ఫ్‌కు వాషింగ్‌ మెషిన్‌లో ఉతికినట్టుగానే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఆ మహిళ బట్టలు ఉతుకుతున్న విభిన్నమైన తీరును చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. @BhartRajesh అనే ఖాతాతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేశారు. దీనిపై చాలా మంది స్పందించారు. ఈ స్వదేశీ జుగాద్ దేశం నుండి బయటకు వెళ్లకూడదని ఒక వ్యక్తి రాశాడు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట దూసుకుపోతోంది. విపరీతమైన వ్యూస్, లైకులతో హోరెత్తిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..