Watch: మారింది మ్యారేజ్ ట్రెండ్.. రాకెట్‌బాంబుపై ఊరేగుతున్న వధూవరులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
పెళ్లి అనంతరం ఊరేగింపుగా తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్నారు. వరుడు వారి ముందు ఉంచిన ఒక పెద్ద రాకెట్ బాంబు మీద కూర్చుని ఉన్నాడు. తల్లిదండ్రులు ఏడుస్తున్న వధువును వరుడి వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు వధువు కూడా వరుడి వెనుక రాకెట్ మీద కూర్చుంటుంది. ఆ తరువాత ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆ రాకెట్‌కు నిప్పు పెట్టాడు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషకరమైన సందర్భం. కానీ, పెళ్లి అనంతరం జరిగే వధువు వీడ్కోలు సమయం మాత్రం అందరినీ కంటతడిపెట్టిస్తుంది. వరుడి కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ అమ్మాయి అప్పగింతల వేళ కన్నీళ్లు పెట్టుకుంటారు. వధువు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు, బంధుమిత్రులు సహా అందరూ బరువెక్కిన హృదయంతో వధువును అత్తవారింటి సాగనంపుతారు. వధువు కూడా ఏడుస్తూ తన పుట్టింటిని వదిలి మెట్టినింటికి వెళ్తుంది. అలాంటిది ఈరోజుల్లో పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించుకునే అద్భుత అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. పెళ్లి అంటే ఈ రెండు షూట్లూ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వధువు వీడ్కోలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమైన వివాహమా లేక రీల్స్ కోసం చేసిన వివాహమా అనేది తెలియరాలేదు. కానీ, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. పెళ్లికూతురును ఇలా పంపిస్తారనే విషయం మాకు తెలియదని సోషల్ మీడియా వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైరల్ వీడియో ప్రారంభంలో ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. అక్కడ ఒక పెళ్లి వేడుక జరిగినట్టుగా తెలుస్తుంది. పెళ్లి అనంతరం ఊరేగింపుగా తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్నారు. వరుడు వారి ముందు ఉంచిన ఒక పెద్ద రాకెట్ బాంబు మీద కూర్చుని ఉన్నాడు. తల్లిదండ్రులు ఏడుస్తున్న వధువును వరుడి వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు వధువు కూడా వరుడి వెనుక రాకెట్ మీద కూర్చుంటుంది. ఆ తరువాత ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆ రాకెట్‌కు నిప్పు పెట్టాడు. దీంతో చూస్తుండగానే రాకెట్ గాల్లోకి లేస్తుంది. వధూవరులు రాకెట్‌లో ఎగిరిపోతున్నారు.
@Masterji_UPWale అనే ఖాతాదారు ఈ వీడియోను X ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసారు. ఈ 34 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వ్యూస్ 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో చూస్తుంటే వరుడు తన వధువును హనీమూన్ కోసం నేరుగా చంద్రుడి వద్దకు తీసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది. మనమందరం కలిసి వారికి హనీమూన్ శుభాకాంక్షలు తెలపాలి. ఇలాంటి ఎడిటింగ్ చేస్తున్న వ్యక్తికి నా సెల్యూట్ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఈ వీడియో చూడండి..
India is not for beginners 😜 pic.twitter.com/9YX3Ap3yaj
— Professor (@Masterji_UPWale) August 24, 2024
నేటి కాలంలో పెళ్లి కాన్సెప్ట్‌లో ట్రెండ్స్ మారుతున్నాయి . దశాబ్దాల క్రితం నాటి వీడియోలు చూస్తుంటే నవ్వు వస్తుంది. దాదాపు 10 ఏళ్ల క్రితం ఫొటోలు తీసే శైలి కూడా నేడు పూర్తిగా మారిపోయింది. నేడు, వాస్తవిక వీడియోలను రూపొందించడానికి అధునాతన ఎడిటింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..