Watch: వీడి పిచ్చి తగలెయ్య…పాముతో రొమాన్స్ ఏంట్రా సామీ..! విషసర్పం నోటిలో నాలుక పెట్టి మరీ..
అవును, మీరు విన్నది నిజమే.. వైరల్ వీడియోలో యువకుడు ముందుగా ఒక పామును పట్టుకున్నాడు. ఆ పాము అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అతడు దాన్ని వదిలిపెట్టలేదు. ఎట్టకేలకు పట్టుకున్నాడు. దాని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ.. పాములా తన నాలుకను బయటకు తీస్తాడు, అప్పుడు ఆ పాము
నేటి ఇంటర్నెట్ యుగంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, వావ్ అనిపించే వీడియోలకు కొదవలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. రీల్స్ పిచ్చితో వ్యూస్ కోసం కొందరు ప్రాణాలను పణంగా పెట్టేవాళ్లు కూడా ఉన్నారు.. ఇక్కడ కూడా అలాంటిదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీకేం పోయేకాలంరా బాబు.. ఎందుకిలాంటి వింత, విచిత్రమైన చేష్టలతో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పాములు, మనుషులతో స్నేహం, వాటితో వ్యాపారం వంటి అనేక కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, సామాన్యుడు, పాము ఒకరినొకరు రొమాన్స్ చేసే సినిమాలు లేవనే చెప్పాలి… కానీ నిజ జీవితంలో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువకుడు సజీవంగా ఉన్న పామును పట్టుకుని దాని నోటిలో అతని నాలుకను దూర్చాడు. ఆ పాము కూడా అతన్ని కాటేయదు.
అవును, మీరు విన్నది నిజమే.. వైరల్ వీడియోలో యువకుడు ముందుగా ఒక పామును పట్టుకున్నాడు. ఆ పాము అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అతడు దాన్ని వదిలిపెట్టలేదు. ఎట్టకేలకు పట్టుకున్నాడు. దాని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ.. పాములా తన నాలుకను బయటకు తీస్తాడు, అప్పుడు ఆ పాము తన నోరు తెరిచింది. దాంతో అతడు పాము నోటిలోకి తన నాలుకను ఉంచాడు. పాము అతని నాలుకను పట్టుకుని క్షణాల్లో వదులుతుంది. కానీ దాడి చేయదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని అంగరా షోజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. అంగారా తరచుగా పాములతో కూడిన అనేక వీడియోలను షేర్ చేస్తుంటుంది.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 56 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా.. ఇప్పటివరకు ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది దీన్ని లైక్ చేసి షేర్ చేశారు. చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.