ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, వంటి వ్యాధుల నివారణలో కూడా ఈ పప్పును వాడుతారు. ఈ పప్పులో ప్రోటీన్లు, విటమిన్ బీ పుష్కలంగా లభిస్తాయి. మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి బయటపడొచ్చు. డయాబెటిస్ రోగులకే కాదు అందరికీ ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. ఇందులో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది.