AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత మారిపోయింది గురూ..! ధైర్యం మూవీ హీరోయిన్ ఇప్పుడు మామూలుగాలేదుగా.!!

యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. నితిన్ కెరీర్ లో ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు. నితిన్ సూపర్ హిట్ సినిమాల్లో దైర్యం సినిమా ఒకటి .

ఎంత మారిపోయింది గురూ..! ధైర్యం మూవీ హీరోయిన్ ఇప్పుడు మామూలుగాలేదుగా.!!
Movie News
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 8:30 PM

Share

డైరెక్టర్‌ తేజ తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు ఎంతో ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమా ‘చిత్రం’లో నటించిన రీమాసేన్‌ మొదలు లక్ష్మీ కల్యాణంలో యాక్ట్‌ చేసిన కాజల్‌ అగర్వాల్‌ వరకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 2005లో యూత్‌ స్టార్‌ నితిన్‌ కాంబినేషన్‌లో తేజ తెరకెక్కించిన చిత్రం ధైర్యం. ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ రైమాసేన్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రైమా. దీంతో మరికొన్ని తెలుగు సినిమాల్లో కనిపిస్తుందనుకున్నారు చాలామంది. కానీ సినిమా కూడా ప్లాప్‌గా నిలవడంతో అదేమీ జరగలేదు. అయితే రవితేజ, ఉదయ్‌కిరణ్‌, తరుణ్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి.

కానీ బాలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ స్పీడ్‌లో దూసుకెళ్లింది. గాడ్‌ మదర్‌ అనే సినిమాతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అలాగే తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అడపాదడపా కనిపించింది. ఆ మధ్యన ఒడిశాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడితో రైమాసేన్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా హల్‌చల్‌ చేశాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అతనికి బ్రేకప్‌ చెప్పేసినట్లు రూమర్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ యాక్టింగ్‌పైనే దృష్టి సారించిందట. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా కేవలం బెంగాలీ సినిమాల్లోనే కనిపిస్తోంది. అలాగే కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. మొన్నామధ్య ఓ బెంగాలీ వెబ్‌సిరీస్‌లోనూ నటించి మెప్పించింది. ఇక సోషల్‌ మీడియాలోయూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం
బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే..
బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే..
శ్రీశైలంలో పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..?
శ్రీశైలంలో పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..?