థైరాయిడ్ రోగులకు వరం.. నల్ల జీలకర్ర నీటితో సమస్య పరార్!
Samatha
06 march 2026
జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ వంటల్లో దీనిని ఉపయోగిస్తారు. ఇక దీనిలో రెండు రకాలు ఉంటాయి.
జీలకర్ర
అందులో నల్లజీలకర్ర ఒకటి. ఇది చాలా తక్కువగా ఉపయోగిస్తారు కానీ, ఈ జీలకర్ర వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల జీలకర్ర
ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది వరం అని చెప్పాలి. ఎవరైతే చాలా రోజుల నుంచి థైరాయిడ్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారు దీనిని తమ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది.
థైరాయిడ్ రోగులకు
నల్ల జీలకర్ర నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వలన ఇది థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుందంట. హర్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.
నల్లజీలకర్ర నీరు
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక అర టీస్పూన్ నల్లజీలకర్రను తీసుకోవడం వలన ఇది థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తుందంట.
థైరాయిడ్, మధుమేహం
అందువలన నల్లజీలకర్ర పొడిని ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి తీసుకోవాలంట. ఇలా ప్రతి రోజూ తాగడం వలన జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
థైరాయిడ్ పనితీరు
ఈ నల్లజీలకర్రలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా థైమోక్వీనోన్, అనే అత్యంత శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉండటం వలన ఇది చాలా మేలు చేస్తుంది.
బయోయాక్టివ్ సమ్మేళనం
థైరాయిడ్ గ్రంథి పనితీరుపు మెరుగు పరిచి, థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.