భోజనం చేసిన వెంటనే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా?

Samatha

06 march 2026

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి రోజూ తప్పకుండా తగినంత నిద్రపోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ , సోషల్ మీడియా ప్రభావం వలన ఎక్కువగా నిద్రపోవడం లేదు.

నిద్ర

కొంత మంది చాలా త్వరగా నిద్రపోతే, కొంత మంది అస్సలే నిద్రపోరు. కానీ కొందరు మాత్రం తిన్న వెంటనే నిద్రపోతుంటారు. మరి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుందో?

తిన్న తర్వాత నిద్ర

కాగా, ఇఫ్పుడు మనం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణులు

భోజనం చేసిన వెంటనే నిద్ర రావడం సహజం అంటున్నారు నిపుణులు. కానీ కొంత మంది ఇది ఏదైనా అనారోగ్య సమస్య ఏమో అని భయపడి పోతుంటారు.

సహజం

భోజనం చేసిన వెంటనే నిద్ర రావడాన్ని పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ అని అంటారంట. దీని వలన తిన్న వెంటనే బద్ధకంగా అనిపిస్తూ నిద్ర వస్తుందంట.

పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్

అయితే ఎక్కువగా చాలా మందిలో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేదా అరగని ఆహారం, కార్బో హైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వలన బద్ధకంతో పాటు నిద్ర వస్తుందంట.

ఆహారం జీర్ణకాకపోవడం

ఇంక కొందరిలో నిద్ర అలవాట్లు మార్పు, సరిగ్గా నిద్రలేకపోవడం , రక్తప్రవాహం జీర్ణ వ్యవస్థ వైపు మళ్లినప్పుడు, అది గ్లూకోజ్‌గా మారి, హర్మోన్లు విడుదల అవుతాయంట, దీని వలన నిద్ర వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నిద్ర అలవాట్ల మార్పు

ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన బద్ధకం, నిద్ర అనేది ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

కార్బోహైడ్రేట్ ఫుడ్