AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రం ఒడ్డున చనిపోయిన గాడ్స్‌ ఫిష్‌.. ప్రపంచ వినాశానికి సంకేతమా..?

వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన చేప. ఇది 12 అడుగుల పొడవుతో ఉంటుంది. సుమారు 30 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద కళ్ళు, దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది. సాధారణంగా ఈ చేప సునామీలు, వరదలు వంటి విపత్తులను అంచనా వేస్తుంది. ఈ చేప కనిపిస్తే..

సముద్రం ఒడ్డున చనిపోయిన గాడ్స్‌ ఫిష్‌.. ప్రపంచ వినాశానికి సంకేతమా..?
Doomsday Fish
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2024 | 10:00 AM

Share

సాధారణంగా సముద్రంలో లక్షలాది చేప జాతులు కనిపిస్తాయి.. కానీ గాడ్స్ ఫిష్ అని పిలిచే ఈ చేప పేరులోనే కాకుండా ఆకారంలోనూ వింతగా ఉంటుంది. అంతేకాదు.. ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చేప కనిపిస్తే సునామీ, వరదలు వంటి విపత్తులు సంభవిస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ చేప మృత దేహం సముద్రం ఒడ్డున దర్శనమివ్వడంతో ఇదేదో పెద్ద సంఘటనకు సంకేతమని జనాలు ఆందోళనలో పడ్డారు. చనిపోయిన చేపలను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ చేప పేరు డూమ్స్‌డే, ప్రపంచంలోని అరుదైన చేపలలో ఒకటి, ఈ చేపను ఫిష్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన చేప. ఇది 12 అడుగుల పొడవుతో ఉంటుంది. సుమారు 30 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద కళ్ళు, దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది. సాధారణంగా ఈ చేప సునామీలు, వరదలు వంటి విపత్తులను అంచనా వేస్తుంది. ఈ చేప కనిపిస్తే ఇలాంటివి జరుగుతాయని ప్రజల నమ్మకం. అలాంటిది ఈ చేప సముద్ర తీరంలో చనిపోయింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

ఈ చేపలు కనిపించడం వినాశనానికి సంకేతమని సాధారణంగా నమ్ముతారు. 2011లో జపాన్‌లో భూకంపం రావడానికి ముందు, ఒడ్డున తేలుతున్న 20 ఓర్‌ఫిష్‌ల ద్వారా భూకంపం వస్తుందని అంచనా వేశారు. భూకంపానికి ముందు, ఈ చేపలు సముద్రం ఒడ్డుకు తేలాయి. దాంతో భారీ విధ్వంసం జరిగింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సముద్రం ఒడ్డున ఈ చేప చనిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు, సముద్రం ఒడ్డున చచ్చిపడివున్న ఈ చేపలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన ప్రజలలో తీవ్ర ఆందోళనను సృష్టించింది. ఏం జరగబోతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తలనొప్పి, అలసటకు చెక్ పెట్టే సింపుల్ చిట్కా! పరగడుపున ఇలా చేయండి
తలనొప్పి, అలసటకు చెక్ పెట్టే సింపుల్ చిట్కా! పరగడుపున ఇలా చేయండి
మార్కెట్‌లోకి మహీంద్రా XUV 3XO EV.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే..
మార్కెట్‌లోకి మహీంద్రా XUV 3XO EV.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే..
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..