- Telugu News Photo Gallery Chana dal can control blood sugar and weight control in telugu lifestyle news
Chana Dal in Blood Sugar: శనగపప్పుతో షుగర్ మాయం..! ఈ ఐదు లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఫైబర్, చక్కెరలు, శ్యాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, పొటాషియం, వీటితో పాటు.. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, క్యాల్షియం, ఐరన్ వంటివి కూడా శనగల్లో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, శనగపప్పులో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ గ్లూకోజ్ జీవక్రియలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది రోజంతా శక్తిని అందిస్తుంది. శనగపప్పు తింటే కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 28, 2024 | 7:06 AM

శనగపప్పు రుచితో పాటు నాణ్యత కూడా చాలా ఎక్కువ. శనగపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లైనా శనగపప్పు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బరువు నియంత్రణ: శనగపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో తీసుకునే డైట్‌లో భాగంగా శనగపప్పును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

గుండె ఆరోగ్యం: శనగపప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

షుగర్ లెవెల్స్ నియంత్రణ: శనగపప్పులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం కూడా సులభంగా తగ్గుతుంది.

ఎముకల ఆరోగ్యం: శనగపప్పులో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి.

జీర్ణక్రియ ఆరోగ్యం కోసం: శనగపప్పులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.





























