- Telugu News Photo Gallery Spiritual photos Shri Krishna Janmashtami celebrated with great joy and devotion at BAPS Swaminarayan Akshardham
Swaminarayan Akshardham: స్వామినారాయణ అక్షరధామ్‌లో ఉత్సాహంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఫొటోలు చూశారా?
స్వామినారాయణ అక్షరధామ్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహంతస్వామి మహరాజ్ సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా శ్రీ కృష్ణ భగవానుడి లీలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Updated on: Aug 27, 2024 | 9:57 PM

స్వామినారాయణ అక్షరధామ్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహంతస్వామి మహరాజ్ సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా శ్రీ కృష్ణ భగవానుడి లీలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మహంత్ స్వామి జీ మహారాజ్ భక్తులకు తన ప్రసంగం వినిపించారు. శ్రీకృష్ణుని మహిమలను కొనియాడారు.

ఈ రోజు శ్రీ కృష్ణుడి పుట్టినరోజంటూ, స్వామినారాయణుడు వచనామృతంలో శ్రీకృష్ణుని పాత్రలను ప్రస్తావిస్తూ భక్తులందరినీ ఉత్తేజ పరిచారు.

'శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా మనకు వినయాన్ని బోధించాడు. అలాగే ప్రతి యుగంలో కనిపిస్తాను అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పారు'

దేవుడు, మంచి వ్యక్తులు భూమిని విడిచిపెట్టరంటూ ఈ సందర్భంగా మహంతస్వామి మహరాజ్ తన ప్రసంగాన్ని భక్తులకు వినిపించారు.

స్వామీజీ ప్రసంగం అనంతరం భక్తులందరూ రంగులరాట్నంలో కూర్చున్న శ్రీకృష్ణుని బాల రూపాన్ని దర్శించుకున్నారు.