AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో..ఈ అక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! ఏకంగా కొండచిలువనే ఉరికించింది..

వైరల్‌ వీడియోలో ఆర్తి ఆ కొండచిలువను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, కొండచిలువ ప్రమాదకరమైన పాము.. దాని పంజా చిక్కినవారు ఎవరూ తప్పించుకుని బయటపడ్డ దాఖలాలు ఉండవని ఆ అమ్మాయికి కూడా తెలుసు. అటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి దానిని పట్టుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తుంది. కానీ, వీడియో చివరి వరకు ఆమె

Watch Video: వామ్మో..ఈ అక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! ఏకంగా కొండచిలువనే ఉరికించింది..
The Young Lady
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2024 | 12:12 PM

Share

వర్షాకాలంలో చాలాసార్లు విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వర్షాలు, వరదల కారణంగా పొదలు, పాము పుట్టల్లోంచి బయటకు వచ్చిన పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఎందుకంటే వర్షాల సమయంలో పొదలు, పాముల రంధ్రాలు నీటితో నిండిపోతాయి. దీంతో పాములు బయటకు వస్తాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో దున్ని పంట పొలంలో బురదలొంచి ఓ కొండచిలువ బయటకు వచ్చింది. అక్కడ పని చేస్తున్న యువతి ఆ కొండచిలువను బంధించే ప్రయత్నం చేసింది.. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

బురద పొలంలో పనిచేస్తున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా తన పొలంలో నక్కి ఉన్న కొండచిలువను గమనిస్తుంది. వెంటనే దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎంతో ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించిన ఆ అమ్మాయి కొండచిలువ తోకను పట్టుకుని దాన్ని బంధించేందుకు ప్రయత్నించింది. అమ్మాయి వెనక్కి వెళ్లి, మళ్లీ కొండచిలువ వైపు కదులుతుంది. దాని తోకను బలవంతంగా లాగడం ప్రారంభించింది. కానీ ఈసారి కొండచిలువ మళ్లీ అమ్మాయిపై దాడి చేసేందుకు ఒక్కసారిగా ఎదురుతిరుగుతుంది. ఆ తర్వాత జరిగిన సీన్‌ నిజంగా ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంది.

ఇవి కూడా చదవండి

కొండచిలువను పట్టుకోబోయిన యువతి పేరు ఆర్తి యాదవ్‌.. ఈ వీడియోను ఆర్తి యాదవ్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @aartiyadav7082 అనే ఖాతాలో పంచుకున్నారు. తను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నివాసి. వైరల్‌ వీడియోలో ఆర్తి ఆ కొండచిలువను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, కొండచిలువ ప్రమాదకరమైన పాము.. దాని పంజా చిక్కినవారు ఎవరూ తప్పించుకుని బయటపడ్డ దాఖలాలు ఉండవని ఆ అమ్మాయికి కూడా తెలుసు. అటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి దానిని పట్టుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తుంది. కానీ, వీడియో చివరి వరకు ఆమె కొండచిలువను పట్టుకోలేకపోయింది.

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Arti Yadav (@aartiyadav7082)

కాగా, ఈ వీడియోను ఇప్పటి వరకు 8 కోట్ల 13 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్ చేసారు. చాలా మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ యువతి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..