పత్తి చేలో కలుపు తీస్తుండగా.. షాకింగ్ సీన్.. దెబ్బకు..
ఓ రైతుకు చెందిన పత్తి పొలంలో కూలీలు కలుపు తీస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో వారికి సమీపంలో ఏదో అలికిడి వినిపించింది. ఏంటా పరిశీలించిన ఆ కూలీలు దెబ్బకు పరుగులు తీశారు. అక్కడ వారికి ఓ భారీ మొసలి కనిపించింది. దెబ్బకు పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో జరిగింది. మల్దకల్ మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు..
ఓ రైతుకు చెందిన పత్తి పొలంలో కూలీలు కలుపు తీస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో వారికి సమీపంలో ఏదో అలికిడి వినిపించింది. ఏంటా పరిశీలించిన ఆ కూలీలు దెబ్బకు పరుగులు తీశారు. అక్కడ వారికి ఓ భారీ మొసలి కనిపించింది. దెబ్బకు పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో జరిగింది. మల్దకల్ మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు.. పత్తిపంటలో కలుపు తీసేందుకు కూలీలను రప్పించాడు.. కూలీలంతా కలుపు తీస్తుండగా.. శుక్రవారం ఉదయం మొసలి కనబడింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు పంట యజమానికి సమాచారం అందించారు. దీంతో సవారన్న పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు.. అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటు పోలీసులు.. ఇటు ఫారెస్ట్ సిబ్బంది స్థానికుల సహాయంతో మొసలిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. అది సమీపంలోని బావిలోకి దూకింది. దీంతో ఐదుగంటల పాటు శ్రమించి మోటర్ల ద్వారా నీటిని బయటకు తీశారు.. అనంతరం తాళ్ల సాయంతో మొసలిని బయటకు తీశారు. తర్వాత దానిని బంధించి ఆటోలో తరలించి గద్వాల సమీపంలోని జూరాల ప్రాజెక్టులో వదిలేశారు. అందరినీ పరుగులు పెట్టించిన మొసలి ఎట్టకేలకు పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మొసలి బరువు సుమారు రెండు క్వింటాళ్లు ఉంటుందని అటవీ అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..
రంగుమారిన భీమిలి సముద్రం నీరు !! తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ??
లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్
N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు
శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

