లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) లో మందుల నిల్వలకు స్థలం సరిపోక.. సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మెడిసిన్స్ నిల్వ చేశారు సిబ్బంది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షల విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలకపాలవుతున్నాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచిన మందులను ఎలుకలు కొరికేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్

|

Updated on: Aug 28, 2024 | 12:09 PM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) లో మందుల నిల్వలకు స్థలం సరిపోక.. సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మెడిసిన్స్ నిల్వ చేశారు సిబ్బంది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షల విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలకపాలవుతున్నాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచిన మందులను ఎలుకలు కొరికేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా మందుల నిల్వ ఉంచారు. సీజనల్ వ్యాధుల విజృంభణంతో ప్రభుత్వం అదనంగా ఔషధాలను.. మందు గోలిలీలను, సిరప్‌లు, ఇంజక్షన్లు, యాంటి బయోటిక్స్ ను సరఫరా చేసింది. మందులు నిల్వ ఉంచుకునేందుకు‌ స్థలం సరిపోక పోవడంతో‌ సమీపంలోని రిమ్స్ ఆస్పత్రులోని‌ ఆడిటోరియం హాల్ లో‌ తాత్కాలికంగా ఔషధాలను నిల్వ ఉంచారు టీఎస్ఎంఐడీసీ అధికారులు. ఈఈ నరసింహారావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మందులు ఎలుకల పాలవడం కలకలం రేపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

N కన్వెన్షన్ కబ్జా కథ ఇదే.. హైదరాబాద్‌లో ఆక్రమణలపై భయంకర నిజాలు

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు ??

హైబ్రిడ్‌ రాకెట్స్‌ వచ్చేశాయి.. వీటి స్పెషాల్టీ ఏమిటంటే ??

Explainer: హైదరాబాద్‌లో అంత మంది గురకపెడుతున్నారా ??

Follow us