హైబ్రిడ్ రాకెట్స్ వచ్చేశాయి.. వీటి స్పెషాల్టీ ఏమిటంటే ??
రాకెట్ ప్రయోగంలో భారత్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం శనివారం జరిగింది. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌జోన్ ఇండియా సంస్థ తయారుచేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు.
రాకెట్ ప్రయోగంలో భారత్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం శనివారం జరిగింది. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌జోన్ ఇండియా సంస్థ తయారుచేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు. దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్‌ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌పాడ్‌పై నుంచి ప్రయోగించారు. ఇది కిలోకన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో శాటిలైట్లను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలి నాణ్యత తదితరాల్ని క్యూబ్ ఉపగ్రహాలు సేకరించనున్నాయి. నింగిలో పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

