మద్యం తాగడం, స్మోకింగ్ వంటి అలవాట్ల కారణంగా కూడా సరైన నిద్ర ఉండదు. ఇవి నిద్రపై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. తాగిన వెంటనే నిద్ర వస్తుంది. కానీ మత్తు దిగాక మెలకువ వచ్చి నిద్రపట్టదు. అలాగే, పడుకునే ముందు మితంగా, సమతుల్య ఆహారం తీసుకోవాలి. గోధుమ పాస్తా, ఓట్ మీల్, పాల ఉత్పత్తులు, హెర్బల్ టీ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. కానీ, పడుకునే ముందు టీ, కాఫీలు తాగొద్దు.