AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నోట్లో నోరు పెట్టి మరీ.. ప్రాణాలు హరించే పాముకు జీవం పోసిన యువకుడు.. నువ్వు దేవుడు సామి!

CPR Revives Electrocuted Snake: ఆపద వస్తే శత్రువునైనా మిత్రుడిగా భావించి ఆదుకోవడం.. మానవుల నైజం. ఇలాంటి సందర్భాలు, ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకరి నుంచి మనకు ప్రాణహాని ఉందని తెలిస్తే.. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లే ధైర్యం చేయని ఈ రోజుల్లో ఒక వ్యక్తి మాత్రం.. తన ప్రాణాలకు తెగించి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరెంట్‌ షాక్‌కు గురైన ఒక పామును సీపీఆర్ చేసి బతికించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: నోట్లో నోరు పెట్టి మరీ.. ప్రాణాలు హరించే పాముకు జీవం పోసిన యువకుడు.. నువ్వు దేవుడు సామి!
Viral News
Anand T
|

Updated on: Dec 05, 2025 | 1:43 PM

Share

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ఒక పాముకు సీపీఆర్ చేసి జీవం పోశాడు ఒక వ్యక్తి ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. ఒక వన్యప్రాణుల రక్షకుడు విద్యుత్ షాక్‌కు గురైన పాముకు నోటి ద్వారా CPR చేసి దాని ప్రాణాలు నిలబెట్టాడు. సీపీఆర్ చేసిన కొద్ది సేపటి తర్వాత మేలుకున్న ఆ పాము మెల్లగా అక్కడి నుంచి స్థానికంగా ఉన్న పొదల్లోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మానవుల ప్రాణాలకు హాని కలిగించే పాములకు సైతం ప్రాణం పోసినందుకు సదురు వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాళ్లలోకి వెళ్తే.. గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతంలో ఆహారం కోసం వెతుకుతూ జనాసాల్లోకి వచ్చిన పాము ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైంది. విషయం తెలసుకున్న ముఖేష్ వాయద్ అనే ఒక వ్యణ్యప్రాణుల సంరక్షుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. పాము పరిస్థితిని పరీక్షించాడు. పాములో ఎలాంటి కదలికలు, స్పందన లేకపోవడంతో.. దానికి నోటి ద్వారా సీపీఆర్ చేశాడు. ఇలా చేసి కొద్ది సేపటి తర్వాత పాములో కదలికలు కనిపించాయి. దీంతో ఆ పాము పూర్తిగా కోలుకునేంత వరకు వేచి చూసి తర్వాత దాన్ని సమీపంలోని చెట్ల పొదల్లో వదిలిపెట్టాడు.

ముఖేష్ పాముకు సీపీఆర్ చేయడాన్ని ఆశ్చర్యకరంగా తిలకించిన స్థానికులు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముఖేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ప్రమాదానికి గురైన పాము ఇదే

ఇక్కడ ప్రమాదానికి గురైన పామును ఇండియన్ రాట్ స్నేక్ అంటారు. అంతే కాకుండా దీనిని ప్ట్యాస్ మ్యూకోసా అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా భారతదేశం, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది వేగంగా కదిలే, చురుకైన జీవి, దీని ఆకారం, చురుకుదనాన్ని చూసి చాలా మంది దీని నాగుపాము అని అప్పుగా భావిస్తారు. అయితే, ఈ పాము వల్ల మానవులకు ఎలాంటి హాని జరగదట. ఎందుకుంటే ఈ పాముకు విషం ఉండదట. ఈ పాములు ఎక్కువగా వ్యవసాయ పొలల్లో, ఇళ్లలో ఎలుకలను వేలాడుతూ ఉంటాయట.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.