రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. ఆయనకు బాడీగార్డులు, బాడీ డబుల్స్ ఉంటారు. విదేశీ పర్యటనల్లో పుతిన్ మలాన్ని సేకరించి విశ్లేషణకు అందకుండా రష్యాకు పంపిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కారు, ఫ్లయింగ్ క్రెమ్లిన్ వంటి అత్యాధునిక రవాణా సౌకర్యాలను ఉపయోగిస్తారు.