ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాపసాని కిచ్చారెడ్డి, తన పెన్షన్ సొమ్ముతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. 68 ఏళ్ల ఈయన గత రెండేళ్లలో 600కు పైగా గుంతలను పూడ్చి గ్రామస్తుల ప్రశంసలు అందుకున్నారు. ప్రమాదాలను నివారించేందుకు తన వంతు కృషి చేస్తున్న కిచ్చారెడ్డి నిజమైన హీరో అనిపించుకుంటున్నారు.