AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రోడ్లపై ఏం కూర్చుంటారు.. వచ్చి స్టేషన్‌లో కూర్చోండి.. ఆకతాయిలకు పోలీసుల మాస్ వార్నింగ్

రాత్రి వేళల్లో ఆలస్యంగా రోడ్లపై తిరుగుతూ, అల్లర్లకు పాల్పడేవారి బెండు తీసేందుకు ఆసిఫ్ నగర్ పీఎస్‌ పరిధిలో ఆపరేషన్ చబుత్ర చేపట్టారు పోలీసులు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాత్రి ఆలస్యంగా తిరుగుతూ, వీధుల్లో కూర్చొనే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కొందరి యువకులను అదుపులోకి తీసుకొని వారికి పీఎస్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు.

Watch: రోడ్లపై ఏం కూర్చుంటారు.. వచ్చి స్టేషన్‌లో కూర్చోండి.. ఆకతాయిలకు పోలీసుల మాస్ వార్నింగ్
Hyd News
Anand T
|

Updated on: Dec 05, 2025 | 3:47 PM

Share

రాత్రి పూట పెరుగుతున్న నేరాల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్ పీఎస్‌ పరిధిలో ఆపరేషన్ చబుత్రను చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగా అర్థరాత్రి రోడ్లపై తిరగుతూ వీధుల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ, అల్లర్లకు కారణమవుతున్న వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇలానే అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న పలువురు యువకులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసకున్నారు.

వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రి మొత్తం స్టేషన్‌లో కౌన్సలింగ్ ఇచ్చారు. కౌన్సలింగ్‌లో భాగంగా వారికి ఆపరేషన్ చబుత్రా గురించి వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. అలాగే పట్టుబడిన వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. పిల్లలు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని సూచించారు.

వీడియో చూడండి..

పోలీసుల చొరవను స్వాగతిస్తున్న స్థానికులు

ఆసిఫ్ నగర్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చుబుత్రను స్థానికు నివాసితులు ప్రశంసించారు.రాత్రి వేళల్లో స్థానికులకు ఇబ్బంది కలింగే వారిపై చర్యలు తీసుకొని పోలీసులు తమకు ఉపశమనం కలిగించారని ఈ ఆపరేషన్‌తో స్థానికంగా శాంతి, క్రమశిక్షణ తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.