క్రాసింగ్ వద్ద రైలును ఆపేసి లోకోపైలట్ చేసిన పనితో భారీగా స్తంభించిన ట్రాఫిక్.. కారణం ఎంటంటే..
గేటు వేసి ఉండడంతో,ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అందులో కూర్చున్న డ్రైవర్లు రైలు వెళ్లే వరకు వేచి చూస్తున్నారు. అయితే సిగ్నల్ ఉన్నప్పటికీ రైలు నిలిచిపోయింది. దీంతో ఓ దారిన వెళ్లే వ్యక్తి కెమెరాలో ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం వైరల్ కావడంతో రైల్వే శాఖ కూడా స్పందించింది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
భారతీయ రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది ఒక రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన సంఘటన. అయితే ఈసారి క్రాసింగ్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి కారణం ఎంటో తెలుసుకున్న ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహానికి గురి కాగా, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి దీనికి కారణాన్ని వివరిస్తూ.. లోకో పైలట్‌కు స్నాక్స్, న్యూస్ పేపర్ ఇవ్వటం కోసం స్టేషన్ మాస్టర్ రైలును ఆపివేశారని, ఇది గేట్ వద్ద ట్రాఫిక్ జామ్‌కు దారితీసిందని పేర్కొన్నారు.
వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేయబడింది. NH7లో రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్ మాస్టర్ రైలు డ్రైవర్‌కు కొన్ని స్నాక్స్, న్యూస్ పేపర్ అందించేందుకు ఇక్కడ రైలును ఆపేశారు. ఈ వీడియో నిడివి కేవలం 22 సెకన్లు మాత్రమే. ఇందులో క్రాసింగ్ గేటు వద్ద ఆగి ఉండగా, అటు ఇటు ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్టేషన్ మాస్టర్ ఇంజిన్ దగ్గర లోకో పైలట్‌తో మాట్లాడుతూ కనిపించాడు.
Can you believe this? On NH7, a train stopped at a railway crossing, causing a massive traffic jam, just so the station master could hand over some snacks and a newspaper to the train driver. Unreal! @IRCTCofficial pic.twitter.com/ZZuF6q0fKL
— Rattan Dhillon (@ShivrattanDhil1) August 28, 2024
గేటు వేసి ఉండడంతో,ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అందులో కూర్చున్న డ్రైవర్లు రైలు వెళ్లే వరకు వేచి చూస్తున్నారు. అయితే సిగ్నల్ ఉన్నప్పటికీ రైలు నిలిచిపోయింది. దీంతో ఓ దారిన వెళ్లే వ్యక్తి కెమెరాలో ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం వైరల్ కావడంతో రైల్వే శాఖ కూడా స్పందించింది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..